నియోజకవర్గంలో 360 మందిని ఎన్‌కౌంటర్‌ చేయించాడు.. కడియంపై కస్సుమన్న రాజయ్య 

30 Aug, 2022 01:53 IST|Sakshi

చిల్పూరు: కడియం శ్రీహరి టీడీపీ హయాం నుంచి అతనికి గిట్టని వారిని ఎన్‌కౌంటర్లు చేయించాడని, ఒక్క నియోజకవర్గంలోనే 360 మంది అమాయకులను చంపించాడని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన ఆరోపణలు చేశారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలో కొత్త పింఛన్‌దారులకు సోమవారం ఆయన కార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు రాజకీయ గురువు వైఎస్సార్‌ అయితే ప్రస్తుత సీఎం కేసీఆర్‌ దేవుడని, నియోజకవర్గానికి తాను పూజారినని, ఆ దేవుడిచ్చే వరాలతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. ఎప్పటికీ స్టేషన్‌ఘన్‌పూర్‌ తన అడ్డా అని.. ఎవరినీ కాలు పెట్టనీయనని శపథం చేశారు.  

మరిన్ని వార్తలు