చంద్రబాబు హయాంలోనే అక్రమ క్వారీయింగ్: వసంత కృష్ణ ప్రసాద్  

29 Jul, 2021 17:33 IST|Sakshi

చంద్రబాబు, దేవినేని ఉమాకు ఎల్లోమీడియా వత్తాసు

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్  

సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలోనే అక్రమ క్వారీయింగ్ జరిగిందని మైలవరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అధికారులను బెదిరించి అప్పటి రెవెన్యూ మంత్రి ద్వారా లీజులు తీసుకున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో కొండ పోరంబోకు భూములుగా రికార్డుల్లో మార్చారని దుయ్యబట్టారు. తనపై దేవినేని ఉమ అసత్య ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు, దేవినేని ఉమాకు ఎల్లోమీడియా వత్తాసు పలుకుతోందని ఆయన ధ్వజమెత్తారు.

‘‘ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టికెట్లు తెచ్చుకున్నవారు ఆయనపైనే చెప్పులు వేశారు. టీడీపీలో లేకుంటే కమ్మ కులస్తులు కాదా?. దేవినేని ఉమాను సొంత నియోజకవర్గంలోనే ప్రజలు ఓడించారు. అక్కడున్నవి రెవెన్యూ భూములా..? ఫారెస్ట్ భూములా? తేల్చాలి. అబద్ధపు ప్రచారాలను ఇప్పటికైనా చంద్రబాబు మానుకోవాలని’’ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ హితవు పలికారు. 

మరిన్ని వార్తలు