మేము ఇక్కడికి దొడ్డిదారిన రాలేదు: బొత్స

2 Dec, 2020 12:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి మంత్రి బొత్స సత్యనారాయణను వీధి రౌడీ అంటూ అనుచిత​వ్యాఖ్యలు చేశారు. మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు జగదీశ్వరరావు, అంగర రామ్మోహన్‌ మంత్రులపైకి దూసుకెళ్లారు. టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందిస్తూ.. మమ్మల్ని వీధి రౌడీలని టీడీపీ సభ్యులు ఎలా అంటారు. మేము ఇక్కడికి దొడ్డిదారిన రాలేదు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం. ఇలాంటి ప్రవర్తన ఎప్పుడూ చూడలేదు. టీడీపీ సభ్యులు నోటికెంత వస్తే అంత మాట్లాడుతున్నారు. చదవండి: (బాబూ వంద కోట్ల ఫైన్ అప్పుడే మర్చిపోయారా..?)

మేము రన్నింగ్‌ కామెంటరీ చేసే వ్యక్తులం కాదు. ప్రభుత్వం తరపున మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ఇది మంచి పద్దతి కాదు' అంటూ బొత్స హెచ్చరించారు. సీనియర్‌ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు మాట్లాడుతూ.. ఇది పెద్దల సభ. సభ్యులు హుందాగా వ్యవహరించాలి. టీడీపీ సభ్యులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. టీడీపీ సభ్యులు సభాసంప్రదాయాలు కూడా పాటించడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  చదవండి:  (ఏపీ అసెంబ్లీ: కీలక బిల్లులు ఆమోదం)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు