ఎన్నిక వచ్చినప్పుడల్లా సవాలేనా?: ఎమ్మెల్సీ కవిత

5 Oct, 2021 08:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో ఎన్నికలు వచ్చిన ప్రతీసారి సవాలు చేయడం సరైంది కాదు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలవడం ఖాయం. రాజకీయాల్లో ఎవరైనా సరే హుందాగా వ్యవహరించాలి’అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. శాసనమండలి ఆవరణలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయాలను ప్రతిపక్షాలు ఎక్కడికి తీసుకెళ్తాయో అర్థం కావడం లేదని, రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ సాధించినన్ని విజయాలు ఎవరూ సాధించలేదని పేర్కొన్నారు.

‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఓడిపోతే సీఎం రాజీనామా చేయాలని అంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఎన్నికను బీజేపీ చాలెంజ్‌గా తీసుకుంది. మరి మమతా బెనర్జీ గెలిస్తే ప్రధా ని మోదీ ఎందుకు రాజీteనామా చేయలేదు. మీడియాలో కనిపించేందుకే సంజయ్‌ ఇష్టారీ తిలో మాట్లాడుతున్నారు’అని కవిత అన్నారు.

మరిన్ని వార్తలు