చంద్రబాబుపై ఎమ్మెల్సీ కవిత షాకింగ్‌ కామెంట్స్‌

22 Dec, 2022 13:12 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్ జిల్లా: తెలంగాణలోకి మళ్లీ రావాలని చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు.. టీడీపీ ఇప్పటీకే భూ స్థాపితమైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. చంద్రబాబు రాజకీయాలు ఇక్కడ నడవవు’ అని అన్నారు.

బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అనేది ఇప్పటికే పలుమార్లు రుజువైంది. పంజాబ్‌లో ఎన్నికలొస్తే  క్షమాపణలు అడగాల్సిన పరిస్థితి మోదీది. అందుకే రైతు వ్యతిరేక బీజేపీకి నిరసనగా రేపటి రైతు ధర్నాను నిజామాబాద్ తో పాటు ప్రతీ జిల్లాలోనూ విజయవంతం చేయాలని కవిత పిలుపు నిచ్చారు. బీజేపీ సర్కార్‌లో కార్పొరేట్లు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలందుకుని దేశసంపదకు చిల్లు పెడుతున్నారు. నల్లధనం తీసుకొస్తానన్న మోదీ హామీ ఏమైపోయిందని కవిత ప్రశ్నించారు.
చదవండి: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌జీటీ భారీ జరిమానా

మరిన్ని వార్తలు