నితీష్‌ని ఇరకాటంలో పడేసిన మోదీ

28 Oct, 2020 15:17 IST|Sakshi

పట్నా: బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు మిథిలా ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణ ప్రస్తావన తీసుకువచ్చి.. నితీష్‌ కుమార్‌పై పరోక్ష విమర్శలు చేశారు. వెంటనే ఆయన పాలనలో బిహార్‌ బాగా అభివృద్ధి చెందింది అంటూ పొగిడారు. వివరాలు.. బిహార్‌లో రెండో రోజు ఉమ్మడి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి నితీష్‌తో కలిసి హజరయ్యారు మోదీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘శతాబ్దాల తపస్సు తర్వాత చివరకు అయోధ్యలో ఒక గొప్ప రామ మందిరం నిర్మిస్తున్నాం. గతంలో ప్రతిపక్షాలు ఈ విషయంలో మమ్మల్ని ‘మందిర నిర్మాణం ఎప్పటి వరకు పూర్తి చేస్తారు.. తేదీ చెప్పండి’ అంటూ ఎద్దేవా చేసేవారు. కానీ ఇప్పుడు వారు కూడా ప్రశంసించవలసిన పరిస్థితి. బీజేపీ-ఎన్‌డీఏ కూటమి గుర్తింపు ఇదే. చెప్పింది చేయగల సత్త మాకు ఉంది. ఈ రోజు మాత సీత తన జన్మస్థలం మిథిలాతో పాటు అయోధ్య వైపు కూడా ఆనందంగా చూస్తుంది’ అన్నారు మోదీ. (చదవండి: తప్పుపట్టడమే కాంగ్రెస్‌ నైజం)

అయితే మందిర నిర్మాణం గురించి మోదీ చేసిన వ్యాఖ్యలు నితీష్‌ కుమార్ని ఉద్దేశించే చేశారని భావిస్తున్నారు. ఎందుకంటే 2015 ఎన్నికల సమయంలో నితీష్‌ కుమార్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌, కాంగ్రెస్‌తో భాగస్వామిగా ఉన్నారు. ఆ సమయంలో మందిర నిర్మణాన్ని ఉద్దేశిస్తూ.. ‘బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రామ్‌ లల్లా మేం అధికారంలోకి వస్తాం.. మందిరాన్ని నిర్మిస్తాం.. కానీ ఖచ్చితమైన తేదీని మాత్రం ప్రకటించలేము అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అంటూ నితీష్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. వీటిని దృష్టిలో పెట్టుకుని నేడు మోదీ ప్రతిపక్షాలతో పాటు స్వపక్షం నితీష్‌ కుమార్పై కూడా విమర్శలు చేశారు. (చదవండి: బిహార్‌ ఎన్నికలపై ‘మద్యం’ ప్రభావం!)

ఆ తర్వాత వెంటనే నితీష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు మోదీ. గత 15 సంవత్సరాలలో నితీష్‌ జీ నాయకత్వంలో బిహార్‌ ఎంతో అభివృద్ధి సాధించింది అన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి నితీష్‌ జీ ఎంతో కృషి చేశారని తెలిపారు. అలానే భావి ముఖ్యమంత్రి అంటూ నితీష్‌ను పిలిచారు. గత వారం మరో ఉమ్మడి ర్యాలీలో, ఆర్టికల్ 370 పై నితీష్ కుమార్ ప్రత్యర్థులు తేజస్వీ యాదవ్, చిరాగ్ పాశ్వాన్‌లు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మోదీ. "ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 370 ను రద్దు చేసింది. కానీ (తేజస్వీ యాదవ్‌)వారు అధికారంలోకి వస్తే తిరిగి తీసుకువస్తామని చెప్పారు. ఇలాంటి ప్రకటనలు చేసిన తరువాత వారు బిహార్ నుంచి ఓట్లు అడగడానికి ధైర్యం చేస్తున్నారు. దేశ రక్షణ కోసం తమ బిడ్డలను సరిహద్దులకు పంపే రాష్ట్రానికి ఇది అవమానం కాదా" అని మోదీ ప్రశ్నించారు. (చదవండి: లాలూకి బెయిల్‌.. నితీష్‌కు ఫేర్‌వల్‌‌)

ఈ రోజు బిహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రారంభం అయ్యింది. 71 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. తదుపరి రెండు రౌండ్లు నవంబర్ 3, 7 తేదీలలో జరుగుతాయి. నవంబర్ 10 న ఫలితాలు వెలువడతాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా