Rahul Gandhi: ‘మోదీ నిరక్ష్యరాస్యుడు’... ‘అయితే రాహుల్‌ డ్రగ్స్‌ అమ్ముతాడు’

19 Oct, 2021 17:28 IST|Sakshi

సాక్షి, బెంగుళూరు:రాహుల్‌ గాంధీ డ్రగ్స్‌కు బానిస, ఆయనో డ్రగ్స్‌ పెడ్లర్‌ కూడా’ అంటూ కర్ణాటక బీజేపీ ప్రెసిడెంట్‌ నలిన్‌ కుమార్‌ కతీల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌పై మీడియాలో వచ్చిన కథనాలనే ఉటంకిస్తున్నానని ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఆయనకు కాంగ్రెస్‌ పార్టీని నడిపే సామర్థ్యం  లేదని నలిన్‌కుమార్‌ మంగళవారం నాటి ఓ మీడియా సమావేశంలో విమర్శలు చేశారు.

ప్రధాని మోదీ నిరక్షరాస్యుడని కర్ణాటక కాంగ్రెస్‌ యూనిట్‌ ట్వీట్లు చేసిన నేపథ్యంలో నలిన్‌ కుమార్‌ కౌంటర్‌ అటాక్‌గా రాహుల్‌పై ఎదురుదాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే, మోదీపై తమ పార్టీ చేసిన ట్వీట్లను తొలగించామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ వివరణ ఇచ్చారు. రాహుల్‌పై నలిన్‌ కుమార్‌ అసభ్య పదజాలాన్ని వాడారని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. ఏ వర్గం వారైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా మసలుకోవాలని, ఇష్టారీతిన వ్యవహరించి అభాసుపాలు కావొద్దని సూచించారు.
(చదవండి: బాహుబలి గోల్డ్‌ మోమోస్‌.. ధర తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే)

ఆజ్యం పోసిన ట్వీట్‌
అక్టోబర్‌ 30న జరగనున్న సిందగి, హంగల్‌ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈక్రమంలో కర్ణాటక కాంగ్రెస్‌ ట్విటర్‌ హ్యాండిల్‌ నుంచి వెలువడిన ట్వీట్‌ అగ్నికి ఆజ్యం పోసింది. ఆ ట్వీట్‌లో ప్రధాని మోదీకి చదువు రాదని కన్నడలో పేర్కొన్నారు. ‘కాంగ్రెస్‌ ఎన్నో పాఠశాలలు నిర్మించింది... మోదీ అక్కడ చదువుకోలేదు. వయోజనులకు కూడా విద్యా కార్యక్రమాలు పెట్టింది... అక్కడా ఆయన చదువుకోలేదు. దేశాన్ని పాలిస్తున్నవారు ప్రజలను సోమరులను చేశారు. కనీసం బిచ్చమెత్తుకుందామంటే అది కూడా లేకుండా నిషేదించారు’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.
(చదవండి: ఉత్తరాన వర్షాలు.. కేరళలో వరద)

>
మరిన్ని వార్తలు