సీఎం కేసీఆర్‌ మహోన్నతమైన నిర్ణయం తీసుకున్నారు: మాజీ మంత్రి

29 Aug, 2021 12:48 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

మంచి పని చేస్తే ఎవరికైనా మద్దతిస్తాం

టీడీపీని నిలువునా ముంచింది రేవంత్ రెడ్డినే

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

సాక్షి, హైదరాబాద్‌: రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు దళితులవని మాజీ మంత్రి, సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. వివక్ష గురై దళితులు ఎంతో మానసిక క్షోభ అనుభివించారని తెలిపారు. గ్రామాల్లో తల రుమాలు, చెప్పులు చేత పట్టుకొని నడవాల్సిన దుస్థితి ఉందని పేర్కొన్నారు. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేసిందని కొనియాడారు. దళిత బంధు వంటి మహోన్నతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. దేశంలో నామమాత్రంగా దళితులకు పథకాలు పెట్టారే తప్ప ఇంతటి పెద్ద నిర్ణయం ఏ ప్రభుత్వం తీసుకోలేదని తెలిపారు. కాగా గత జూలైలో బీజేపీకి మోత్కుపల్లి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, నర్సింహులు టీఆర్‌ఎస్‌లో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఆదివారం మోత్కుపల్లి బేగంపేటలోని తన నివాసంలో మాట్లాడుతూ.. ‘ఒక పార్టీకి రాజీనామా చేసి వచ్చిన తరువాత కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బందుకు మద్దతు ఇవ్వడం అంటే సాహసోపేతమైన నిర్ణయం. ఎంత ఖర్చైన భరిస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. అది చాలా గొప్ప నిర్ణయం. కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది సీఎంలుగా చేశారు. కానీ ఎవ్వరూ కూడా దళితుల సంక్షేమం కోసం పాటుపడలేదు. మమ్మల్ని ఇప్పటికి బానిసలుగానే చూస్తున్నారు. ఇన్ని రోజులు సీఎం కేసీఆర్ గురించి మాట్లాడని మోత్కుపల్లి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటున్నారు. మంచి పని చేస్తే ఎవరికైనా మద్దతిస్తాం. దళిత బంధుకు కాంగ్రెస్ బీజేపీ ఎందుకు అడ్డుపడుతుంది. టీడీపీని నిలువునా ముంచింది రేవంత్ రెడ్డి. అతని వల్లే చంద్రబాబు నాశనం అయ్యారు. రేవంత్ రెడ్డిది శని పాదం. రేవంత్ రెడ్డి జీవితం అంత మోసమే, బ్లాక్ మెయిలింగే. ఆర్టీఐని వాడుకుంది మొత్తం రేవంత్ రెడ్డే’ అని మండిపడ్డారు.
చదవండి: బురదలో కూరుకుపోయిన మంత్రి అజయ్‌ కారు
ఈ ఏడాది ఘనంగా గణేష్ ఉత్సవాలు.. ముస్తాబవుతున్న ఖైరతాబాద్‌

మరిన్ని వార్తలు