సరైన టైంలో నిర్ణయం.. అసదుద్దీన్‌ ఓవైసీ కీలక వ్యాఖ్యలు

9 Feb, 2023 20:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో 50 శాతం స్థానాల్లో పోటీపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. తాజ్‌మహల్‌ కంటే అందమైన సెక్రటేరియట్‌ కేసీఆర్‌ కట్టారు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామం అని అసదుద్దీన్‌ పేర్కొన్నారు.

‘‘తెలంగాణలో మంచి పరిపాలన చేస్తున్నారు.. దేశమంతా వస్తే మంచిదే. మమ్మల్ని బీజేపీ బీ టీం అని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేస్తున్నారు. బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్‌లో జేపీసీ కోసం అడిగితే మోదీ ఒప్పుకోవడం లేదు. సెక్రటేరియట్ ఓపినింగ్ అధికారిక కార్యక్రమం.. అక్కడికి వెళ్తాము. పరేడ్ గ్రౌండ్ మీటింగ్ బీఆర్ఎస్ రాజకీయ సమావేశం.. మాకు సంబంధం లేదు.. ఇతర పార్టీలని పిలిస్తే వాళ్ల ఇష్టం అని అసదుద్దీన్‌ అన్నారు.
చదవండి: సీఎం కేసీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ.. కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?

మరిన్ని వార్తలు