రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

26 Mar, 2023 15:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అదానీ ఇష్యూని డైవర్ట్‌ చేయడానికే రాహుల్‌పై అనర్హత వేటు వేశారు. అవసరమైతే ఎంపీలంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని కోమటిరెడ్డి అన్నారు. రాహుల్‌పై అనర్హత వేటుకు నిరసనగా గాంధీభవన్‌లో ఆదివారం.. కాంగ్రెస్‌ నేతలు దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, ‘‘రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన పరిస్థితి కంటతడి పెట్టేలా ఉంది.. ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వచ్చినా రాహుల్ వదులుకున్నారన్నారు. అదానీ గురించి రాహుల్ ఎప్పుడు మాట్లాడారో.. అప్పటి నుంచి కుట్ర చేశారు. ఆగమేఘాల మీద పరువు నష్టం కేసు లో శిక్ష పడేలా చేశారు’’ అని కోమటిరెడ్డి ఆరోపించారు. రాహుల్ పై అనర్హత వేటు ఎత్తేసే వరకు పోరాటం ఉధృతం చేయాలన్నారు. ఇందిరా గాంధీ పై వేటు వేస్తే ఏం జరిగిందో..ఇప్పుడు అదే జరుగుతుంది’’ ఎంపీ కోమటిరెడ్డి అన్నారు.
చదవండి: కాంగ్రెస్‌లో చేరిన డి.శ్రీనివాస్‌


 

మరిన్ని వార్తలు