బద్వేల్‌ తీర్పుతో చంద్రబాబు మైండ్‌ బ్లాక్‌: నందిగం సురేష్‌

3 Nov, 2021 12:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: విహార యాత్రకు వచ్చినట్టు చంద్రబాబు ఏపీకి వస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు, ఆయన కుమారుడు, దత్తపుత్రుడు ఇళ్లు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వీరంతా రాష్ట్రానికి సంబంధంలేని వ్యక్తులుగా ప్రజలు భావిస్తున్నారన్నారు.

చదవండి: బద్వేలు బ్లాక్‌ బస్టర్‌

‘‘చంద్రబాబు ఫ్యామిలీ ఓట్లు కుప్పంలో లేవు. చుట్టం చూపుగా రాష్ట్రానికి వచ్చే వారిని ప్రజలు నమ్మరు. అమరావతిలో ఇళ్ల పంపిణీని అడ్డుకుంది చంద్రబాబు కాదా?. బద్వేల్‌ తీర్పుతో చంద్రబాబు మైండ్‌ బ్లాక్‌ అయింది. పాదయాత్ర పేరిట అమరావతి జనాన్ని చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు తాపత్రయం అంతా కొంతమంది ప్రయోజనాల కోసమేనని’’  నందిగం సురేష్‌ దుయ్యబట్టారు.
చదవండి: AP: అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖ 

‘‘బద్వేల్‌లో ఓడింది టీడీపీ, జనసేన కూడా. బీజేపీకి 21 వేల ఓట్లు ఎలా వచ్చాయనేది ఆలోచించాలి. చంద్రబాబు పరోక్షంగా సహకరించి ఓట్లు వేయించాడు. ఎన్నికకు దూరం అంటూనే బీజేపీ మద్దతు పలికి తన బుద్ధి ఏమిటో స్పష్టం చేశాడు. సీఎం వైఎస్‌ జగన్ ఓటు పులివెందులలో ఉంటే.. చంద్రబాబు, లోకేశ్ ఓట్లు హైదరాబాద్లో ఉన్నాయి. అమరావతిలో చంద్రబాబు బినామీలు కొనుగోలు చేశారు. తాను అనుకున్న బినామీ రాజధాని కోసం పేదలకు ఇళ్లు ఇస్తే మురికి కూపం అవుతుందన్నారు. అమరావతి శాశ్వత రాజధానిగా సీఎం నిర్ణయం తీసుకున్నారు. అన్నింటితో పాటు అభివృద్ది చేస్తారు. అక్కడి వారిని రెచ్చగొట్టి చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నారు. ఈ యాత్ర రాయలసీమ నుంచి కూడా వెళ్తుంది. వారికి ఏమి సమాధానం చెప్తారు’’ అంటూ సురేష్‌ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు