West Bengal: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు.. కొత్తగా సుకాంత మజుందార్

21 Sep, 2021 08:58 IST|Sakshi

Sukanta Majumdar: పశ్చిమ బెంగాల్‌ బీజేపీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బలూర్‌ఘాట్ బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్‌ను. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా సోమవారం నియమించింది. దిలీప్‌ ఘోష్‌ స్థానంలో నూతనంగా సుకాంత్‌ను నియమించినట్లు బీజేపీ అధిష్టానం పేర్కొంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సుకాంతను రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ వెల్లడించారు.

చదవండి:Sonu Sood: ప్రతి రూపాయి ప్రజల కోసమే: సోనూ సూద్‌

రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌, ఉత్తరాఖండ్‌ మాజీ గవర్నర్‌ బేబీ రాణి మౌర్యలను బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షులుగా పార్టీ ప్రమోట్‌ చేసింది. పశ్చిమ బెంగాల్‌లో మరో పది రోజుల్లో భవానిపూర్‌లో ఉప ఎ‍న్నిక జరగనున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 41ఏళ్ల సుకాంత మజుందార్.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రచారక్‌గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 2014లో ఆయన బీజేపీలో చేరారు.

చదవండి: 24న మోదీ– బైడెన్‌ భేటీ

2019లో బీజేపీ తరఫున బలూర్‌ఘాట్ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఎంపీగా గెలుపొందారు. సెప్టెంబర్ 30న భవానీపూర్‌తో పాటు సంసర్‌గంజ్, జంగిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఉప ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను సుకాంతకు ఇటీవల అప్పగించిన విషయం తెలిసిందే. అదే విధంగా భవానీపూర్‌ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ ప్రియాంక టిబ్రేవాల్ బరిలోకి దించిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు