తెలంగాణలో ఫుల్‌ స్పీడ్‌లో కాంగ్రెస్‌.. ఉత్తమ్‌ ఇంట్రెస్టింగ్‌ వ్యాఖ్యలు

28 Aug, 2023 19:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతలు ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు, ఇతర పార్టీలతో పొత్తులపై కీలక మంతనాలు జరుగుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. 

తాజాగా ఠాక్రే మాట్లాడుతూ.. ‘ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాం. అధికారికంగా లెప్ట్‌ పార్టీలతో చర్చలు జరగలేదు. టీపీసీసీ చీఫ్‌, సీఎల్పీ లీడర్‌ సమక్షంలో లెఫ్ట్‌ పార్టీలతో చర్చలు జరుగుతాయి. పార్టీతో పొత్తుల గురించి అధిష్టానం ఫైనల్‌ డెసిషన్‌  తీసుకుంటుంది. కాంగ్రెస్‌కు మద్దతు పలకడానికి చాలా పార్టీలు ముందుకు వస్తున్నాయి’ అని కామెంట్స్‌ చేశారు. 

మరోవైపు.. సూర్యాపేటలోని కోదాడలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో విద్యార్థి, యువజన సమ్మేళనంకు మాజీ టీపీసీసీ, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి, శివసేనా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ‘సర్వేలన్నీ కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నాయి. డిసెంబర్‌ తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది. నిరుద్యోగులకు రూ.4వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. కోదాడ, హుజూర్‌నగర్‌ నుంచి నేను, పద్మావతి పోటీ చేస్తున్నాం. కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో 50వేల మెజార్టీ తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, బీజేపీలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయి’ అని తీవ్ర ఆరోపణలు చేశారు. 

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌లో టికెట్‌ ఎఫెక్ట్‌.. కాంగ్రెస్‌లోకి సీనియర్‌ ఎమ్మెల్యే!

మరిన్ని వార్తలు