అశోక్‌గజపతిరాజు ఒక దొంగ: విజయసాయిరెడ్డి

16 Jun, 2021 22:02 IST|Sakshi

సాక్షి, అమరావతి: అశోక్‌గజపతిరాజుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అశోక్‌గజపతిరాజు ఒక దొంగని ఆరోపించారు. అశోక్‌గజపతిరాజు తీరుతోనే పంచ గ్రామాల్లో భూ సమస్య నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ సమస్య పరిష్కారానికి సహకరించాలని ఈ సందర్భంగా అశోక్‌గజపతిరాజును కోరుతున్నట్లు తెలిపారు. అశోక్‌గజపతిరాజు దొడ్డిదారిన మళ్లీ సింహాచలం ఆలయ ఛైర్మన్‌ అవ్వాలనుకుంటున్నారని విమర్శించారు. ఈ విషయమై డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌ కోసం  వెళ్తున్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు.

చదవండి: ‘దేవుడి సన్నిధిలో అశోక్‌గజపతిరాజు అసత్యాలు తగదు’

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు