ఏపీ పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సరికొత్త రికార్డు

20 Sep, 2021 11:23 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ సరికొత్త రికార్డ్ సృష్టించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం నమోదు చేసింది. అన్ని జడ్పీ చైర్మన్ల స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుని, 100 శాతం జడ్పీ ఛైర్మన్లను దక్కించుకున్న పార్టీగా రికార్డు సాధించింది.  ఆదివారం విడుదలై షరిషత్‌ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ విజయ ఢంకా మోగించింది.

చదవండి: MPTC, ZPTC elections results: పంచాయతీ, మునిసిపల్‌ను మించి జైత్రయాత్ర

ఇప్పటివరకు 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా,  వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు