12, 13న నిరుద్యోగుల నిరాహార దీక్ష 

11 Sep, 2022 02:18 IST|Sakshi

ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం కావాలి: మంద కృష్ణ  

ఉస్మానియా యూనివర్సిటీ: రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలుకోసం సీఎం కేసీఆర్‌ మెడలు వంచేందుకు ఎస్సీ, బీసీ నిరుద్యోగులు ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. ఎస్సై, కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్‌ మార్కు లు తగ్గించి రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.  

నిరుద్యోగుల సమస్యపై 11న ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తామని, ఈ నెల 12, 13 తేదీల్లో ఇందిరాపార్కు వద్ద సామూహిక నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు. ఓయూలోని ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ సెమినార్‌ హాల్లో శనివారం జరిగిన విద్యార్థి సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మంద కృష్ణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ అభ్యర్థులకు ద్రోహం చేయాలనే ఎస్సై, కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించలేదని,  టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్‌ శ్రీనివాసరావును తొలగించాలని డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు