బీఎస్పీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే: ఎమ్మార్పీఎస్‌

1 Nov, 2022 01:49 IST|Sakshi
మాట్లాడుతున్న వంగపల్లి శ్రీనివాస్‌ 

మర్రిగూడ: బీఎస్పీకి ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లేనని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో నిర్వహించిన మాదిగ ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడారు. నిత్యం దళితులపై దాడులు జరుగుతుంటే బీఎస్పీ పార్టీ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కలిసి ఐక్య ఉద్య మాలు చేస్తుంటే బీఎస్పీ మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఆరోపించారు.  ప్రజలందరూ బీజేపీని ఓడించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రభాకర్‌ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గణేశ్, నర్సింహ, నరేందర్, శంకర్, సాలయ్య, సుదర్శన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు