దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ముద్రగడ

21 Sep, 2020 14:02 IST|Sakshi

సాక్షి, కాకినాడ: మాజీమంత్రి, ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను సోమవారం కాపు జేఏసీ నేతలు కలిశారు. ఉద్యమ నేతగా కొనసాగాలంటూ ఈ సందర్భంగా ముద్రగడను కోరారు. అయితే జేఏసీ నేతల అభ్యర్థనను ఆయన సున్నితంగా తిర్కసరించారు. కాపు ఉద్యమంలోకి  తాను వచ్చేది లేదని ముద్రగడ పద్మనాభం మరోమారు స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా మీతోనే ఉంటానని ఆయన తెలిపారు. కాగా తాను కాపు ఉద్యమం నేతగా తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం కొద్ది నెలల క్రితం ప్రకటించిన విషయం విదితమే. ఈ భేటీ అనంతరం ఆయన ఓ లేఖ విడుదల చేశారు.

‘గౌరవ పెద్దలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటున్నాను. మీ కోరికను గౌరవించలేక పోతున్నందుకు క్షమించమని కోరుతున్నాను. వ్యక్తిగతంగా నేను మీతోనే ఉంటాను. మనం మంచి స్నేహితులం. మీ ఇంటిలో ఏ కార్యక్రమం ఉన్నా తెలియచేస్తే నా ఓపిక ఉన్నంతవరకూ వస్తానండి.  మీ అందరి అభిమానం, ప్రేమ మరువలేనిది. నా ఇంటిలో ఏ శుభకార్యం ఉన్నా నేనే స్వయంగా జిల్లాలకు వచ్చి ఓపిక ఉన్నంతవరకూ ఆహ్వానిస్తాను. దయచేసిన నన్ను ఇబ్బంది పెట్టవద్దని కోరుతున్నాను.’ అని ఆ లేఖలో తెలిపారు.
(చదవండి: కాపు ఉద్యమానికి ఇక సెలవ్)

మరిన్ని వార్తలు