రాజ్యసభ ఉపనాయకుడిగా ముఖ్తర్‌ అబ్బాస్‌

20 Jul, 2021 08:07 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ముఖ్తర్‌ అబ్బాస్‌ నఖ్వి (63)ని రాజ్యసభలో ఉపనాయకుడిగా నియమించాల్సిందిగా ప్రధాని మోదీ తనకు సూచించారంటూ సభా నాయకుడు పియూశ్‌ గోయల్‌ సోమవారం చెప్పారు. ప్రధాని సూచన మేరకు ఆయన్ను ఉపనాయకుడిగా నియమించినట్లు చెప్పారు. రాజ్యసభలో బీజేపీకి బలం లేని నేపథ్యంలో రాజకీయ సమస్యలను పరిష్కరించేందుకు పియూశ్‌ గోయల్‌ను నాయకుడిగా, నఖ్విని ఉపనాయకుడిగా బీజేపీ నియమించింది.

బీజేపీ కేంద్ర మంత్రుల్లో సైతం నఖ్వి ఒక్కరే ముస్లిం వర్గానికి చెందిన ఒకే ఒక వ్యక్తి కావడం గమనార్హం. ఆయన మోదీ మొదటి దఫా ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా కూడా పని చేశారు. ఏబీ వాజ్‌పేయీ హయాంలో సైతం నఖ్వి మంత్రిగా పని చేశారు. 

మరిన్ని వార్తలు