సొంత గూటికి ముకుల్‌ రాయ్‌

11 Jun, 2021 17:27 IST|Sakshi

కోల్‌కతా: ప‌శ్చిమ బెంగాల్‌లో భార‌తీయ జ‌నతా పార్టీకి భారీ షాక్‌ తగిలింది. నాలుగేళ్ల క్రితమే బీజేపీలో చేరిన ముకుల్ రాయ్ మళ్లీ తృణ‌మూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ మేరకు శుక్రవారం  మ‌ధ్యాహ్నం ముకుల్ రాయ్‌ తన కుమారుడు సుభ్రంగ్షు రాయ్‌తో కలిసి బెంగాల్‌ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీతో సమావేశమైన తర్వాత తిరిగి సొంత గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు.  2017లో టీఎంసీని వీడిన ముకుల్‌రాయ్‌.. బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

కాగా బీజేపీ గురువారం నిర్వ‌హించిన స‌మావేశానికి ముకుల్ రాయ్ హాజ‌రు కాలేదు. ఇక ముకుల్ రాయ్ 2017 లో టిఎంసి నుంచి వైదొలిగిన తరువాత, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ముకుల్ రాయ్ ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఆయన సతీమణి కూడా కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ సమయంలో అభిషేక్‌ బెనర్జీ ఆసుపత్రిలో వీరిద్దరిని కలిసి అండగా నిలిచారని సుభ్రాంగ్షు ఇటీవల మీడియాతో చెప్పారు. ముకుల్ రాయ్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని  కృష్ణా నగర్ (ఉత్తర) నియోజకవర్గం నుంచి శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గతంలో రాజ్యసభ సభ్యునిగా, రైల్వే మంత్రిగా పని చేశారు. 

చదవండి:‘పెళ్లి కాలేదంటున్నావ్‌.. గర్భవతివి ఎలా అయ్యావ్‌?’

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు