పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డితో రేవంత్‌ భేటీ.. సాయంత్రం టీ-కాంగ్రెస్‌ ముఖ్య నేతల భేటీ

10 Sep, 2022 13:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి, స్థానిక నేత చెలమల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. మునుగోడు అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని అధిష్టానం ప్రకటించడంతో అసంతృప్తికి గురైన కృష్ణారెడ్డిని పార్టీకి అండగా ఉండాలంటూ రేవంత్‌రెడ్డి నచ్చజెప్పారు. ఉప ఎన్నికలో కలిసి పనిచేయాలని కోరారు. 

ఇదిలా ఉంటే, ఇవాళ సాయంత్రం గాంధీభవన్‌లో టీ కాంగ్రెస్‌ ముఖ్య నేతలు భేటీ జరగనుంది. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికపై చర్చించనున్నారు. మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి, టికెట్ ఆశించి భంగపడ్డ చెలమల కృష్ణారెడ్డి, పల్లెరవి, కైలాష్ నేతలను భేటికి ఆహ్వానించారు. టికెట్‌ రాని ముగ్గురు నేతలకు టీపీసీసీ పెద్దలు నచ్చజెప్పనున్నారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, మధుయాష్కీ, ఇతర ముఖ్య నేతలు హాజరవుతారు. 

చదవండి: (ప్రజాప్రతినిధులను పశువుల్లా కొంటున్నారు.. సీఎం కేసీఆర్‌పై ఈటల ఆగ్రహం)

మరిన్ని వార్తలు