మనుగోడులో పోటీ చేస్తాం.. బీఎస్పీని ఆదరిస్తారనే నమ్మకం ఉంది

8 Aug, 2022 08:40 IST|Sakshi

బిజినేపల్లి: త్వరలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలోని వెల్గొండలో మీడియాతో ఆయన మాట్లాడారు.

మునుగోడు ప్రజలు తమ పార్టీ అభ్యర్థిని ఆదరిస్తా రన్న నమ్మకం ఉందన్నారు. అనంతరం రాబోయే అసెంబ్లీ ఎన్ని కల్లో కూడా తాము పూర్తిస్థాయిలో అభ్యర్థులను నిలబెడతామని వెల్లడించారు.
చదవండి: బీజేపీకి తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి: రేవంత్‌

మరిన్ని వార్తలు