చిరంజీవి పొలిటికల్‌ రీ ఎంట్రీ.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

3 Jun, 2022 12:24 IST|Sakshi

సాక్షి,విజయనగరం: తన సోదరుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని జనసేన నేత కొణిదెల నాగబాబు తెలిపారు. విజయనగరం జిల్లాలో పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి వచ్చిన ఆయన ఓ హోటల్లో గురువారం మీడియాతో మాట్లాడారు.

రానున్న ఎన్నికల్లో జనసేనకు చిరంజీవి మద్దతుగా ఉంటారే తప్ప ఎక్కడా పోటీ చేయరన్నారు. పొత్తులపై అన్నీ ఆలోచించి పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్ణయం తీసుకుంటారన్నారు. జిల్లాలో జనసేన పార్టీ పరిస్థితి తెలుసుకునేందుకు ఇక్కడకు వచ్చినట్టు వివరించారు.

చదవండి: Ambati Rambabu: దేవినేని ఉమకు అంతా తెలిస్తే.. అప్పుడేం చేశారు: మంత్రి అంబటి

మరిన్ని వార్తలు