పాదయాత్రలో లోకేశ్‌ అత్యుత్సాహం.. సైగ చేయడంతో..

2 Sep, 2023 08:46 IST|Sakshi

నల్లజర్ల: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో శుక్రవారం ప్రారంభమైన లోకేశ్‌ పాదయాత్ర పలు గ్రామాల్లో ఉద్రిక్తతలకు దారి­తీసింది. పోతవరంలో ప్రారంభమైన పాదయాత్ర కవులూరు, చీపురుగూడెం, తిమ్మన్నపాలెంలలో జరిగింది.

తిమ్మన్నపాలెం జంక్షన్‌లో సీఎం ఫ్లెక్సీని చూసిన లోకేశ్‌.. యువగళం సభ్యుడికి సైగ చేయడంతో ఆ వ్యక్తి సీఎం ఫ్లెక్సీని మూడొంతులకుపైగా చింపేశా­డు.  విషయం తెలియడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.ఫ్లెక్సీ చింపిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని అడిషనల్‌ ఎస్పీ రజనీ, డీఎస్పీ వర్మ తదితరులు హామీ ఇచ్చారు. వెంటనే అదే ప్రదేశంలో కొత్త ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సంయమనంతో ఉన్నా పలుమార్లు టీడీపీ కార్య­కర్తలు రెచ్చగొట్టే చర్యలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం శాంతించిన కార్యకర్తలు సీఎం జగన్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. సాయంత్రం పాదయాత్ర నల్లజర్ల జంక్షన్‌కు వచ్చేసరికి సొసైటీ అధ్యక్షుడు కారుమంచి రమేష్‌ ఇంటి ముందు నిలబడ్డ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై యువగళం సభ్యుడు పిడిగుద్దు­లు గుద్దాడు. దీనిపై కార్యకర్తలు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.
చదవండి: ఐటీ దర్యాప్తు తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ

మరిన్ని వార్తలు