చంద్రబాబు దుర్మార్గాలను ఎప్పుడైనా ప్రశ్నించారా?

30 Oct, 2020 14:14 IST|Sakshi

సాక్షి, అమరావతి : బషీర్ బాగ్ కాల్పుల్లో అనేక మందిని పొట్టన పెట్టుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని బాపట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. దళితులను అడ్డుపెట్టుకొని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని విమర్శించాడు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ మాట్లాడుతూ.. మూడు రాజధానులకు మద్దతుగా వచ్చిన వారిని అడ్డుపెట్టుకొని బాబు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా ఒక దళిత ఎంపీపై రాడ్లతో దాడికి దిగితే చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అమరావతి రైతులకు బేడీలు వేశారంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆనాడు అసైన్‌మెంట్‌ భూముల రైతులపై చంద్రబాబు చేసిన దుర్మార్గాలను ఎప్పుడైనా ప్రశ్నించారా అని అడిగారు. తప్పు ఎక్కడ జరిగినా తప్పే కానీ వాళ్లని అమరావతి రైతులని బాబు నానా యాగీ చేస్తున్నారన్నారు. చదవండి: నాపై ఐదుసార్లు దాడికి యత్నించారు

‘ప్రభుత్వం ఎదో చేస్తుందంటూ చంద్రబాబు దళిత కార్డ్ ఉపయోగిస్తున్నారు. ఇది దళితుల ప్రభుత్వం... దళిత జాతిని అడ్డుపెట్టుకుని ఏదో చేయాలని ప్రయత్నం చేయొద్దు. రైతులకు బేడీలు వేశారని తెలిసింది. అన్యాయం అనిపించి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేశాం. కోట్లాది రూపాయల లబ్ది మీ బంధువులకు ఇచ్చి ఇప్పుడు ఉద్యమం అంటే దళితులని వాడుకుంటున్నారు. లబ్ధి వాళ్ళకి.. పోరాటం మనకా..? మీ ఇద్దరిని ప్రజలు ఎప్పుడో నడిరోడ్డుపై నిలబెట్టారు. ముందు ఆ విషయం తెలుసుకుని లోకేష్ మాట్లాడితే మంచిది. రియల్ ఎస్టేట్ తప్ప అమరావతిలో ఏమన్నా జరిగిందా. అక్రమం జరిగింది అంటే నిరూపించు అన్నావు. విచారణ వేస్తే మళ్లీ కోర్టులకు వెళ్ళావు. దళితులు బాగుపడకూడదు అనేది చంద్రబాబు నైజం. మూడు రాజధానుల ఆందోళనకారులను అడ్డుకోవడానికి నీ సామాజిక వర్గం వ్యక్తులను ఎందుకు పంపలేదు. దళిత సోదరులు చంద్రబాబు కుట్రలను తెలుసుకోవాలి’. అని హితవు పలికారు. చదవండి: ‘ఆయన చెప్పినట్లు ఇక్కడ జరగవు’

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా