రౌడీ రాజకీయాలను ప్రేరేపిస్తున్న బాబు, లోకేశ్‌ 

26 Aug, 2023 05:57 IST|Sakshi

ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ధ్వజం

తిరుపతి సిటీ: చంద్రబాబు, లోకేశ్‌ పాదయాత్రల పేరుతో చంపుతాం.. అంతు చూస్తాం.. అంటూ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం రౌడీ రాజకీయాలను ప్రేరేపించడమేనని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి మేలు చేస్తామని ఒక్క మాట కూడా లోకేశ్‌ తన పాదయాత్రలో మాట్లాడకపోవడం దారుణమన్నారు.పుంగనూరులో టీడీపీ కుట్ర ప్రజలకు అర్థమైందన్నారు.

కులపిచ్చి, వెన్నుపోటు రాజకీయాలు తప్ప ప్రజాప్రభుత్వం రావాలనే ఆకాంక్ష టీడీపీ వారికి లేదన్నారు. రామోజీ గ్రూపునకు చెందిన మార్గదర్శి సంస్థ మోసాలను సీఎం వైఎస్‌ జగన్‌ బయటపెట్టడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. పదవులు పోవడంతో మతిభ్రమించి బొండా ఉమ, అయ్యన్నపాత్రుడు రాక్షసుల్లాగా మాట్లాడుతున్న తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఉచ్చపోయిస్తాం.. అంటున్న లోకేశ్‌ లెట్రిన్, బాత్‌రూమ్‌లు కట్టే పనిలో ఉన్నారా.. అని ప్రశ్నించారు. లోకేశ్‌ అందుకు కూడా పనికిరాడని ఎద్దేవా చేశారు.  

మరిన్ని వార్తలు