'నేను పార్టీ మారానా.. దమ్ముంటే నిరూపించండి'

22 May, 2021 18:56 IST|Sakshi

అమృత్‌సర్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, అమృత్‌సర్‌ ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్దూ మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తూనే ఉంది. తాజగా తాను కాంగ్రెస్‌ను వీడి ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను సిద్దూ ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్లు సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దమ్ముంటే అది నిరూపించాలని సీఎం అమరీందర్‌కు సవాల్‌ విసిరారు. దీంతో పంజాబ్‌ రాజకీయాల్లో వీరిద్దరి మధ్య రగులుతున్న వివాదం మరోసారి ఆసక్తికరంగా మారింది.  

సిద్దూ కాంగ్రెస్‌లో ఉంటూ క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని.. ఆయన ఆప్‌లో చేరుతున్నట్లుగా  తమకు సమాచారం అందిందని సీఎం అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. దీనిపై సిద్దూ  ట్విటర్‌ వేదికగా ధీటుగా బదులిచ్చారు. ''నేను ఇతర పార్టీ నేతలతో భేటీ అయినట్లు నిరూపిస్తారా? ఈరోజు వరకూ నేనెవర్నీ నాకు ఒక పోస్ట్‌ కావాలని అడగలేదు. ఇప్పటికే నన్ను చాలా మంది ఆహ్వానించి.. కేబినెట్ బెర్త్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయినా నేను పార్టీకి ద్రోహం తలపెట్టకూడదని వాటిని తిరస్కరించా. నేను కోరుకునేది కేవలం పంజాబ్ ప్రజల శ్రేయస్సు మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో హైకమాండ్ జోక్యం చేసుకోవాల్సిందే. అప్పటి వరకూ వేచి చూడండి'' అంటూ ట్వీట్ చేశారు.

కాగా సిద్దూ తనకు కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని చూపిస్తూ ట్విటర్‌లో ఒక వీడియోను రిలీజ్‌ చేశారు. ఆ వీడియోలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సిద్ధూ కలిసి దిగిన ఫోటోలు ఉ‍న్నాయి. 
చదవండి: చర్చలకు సిద్ధం: ప్రధానికి రైతు సంఘాల లేఖ

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు