-

కాంగ్రెస్‌ పరువు తీసిన సిద్ధూ.. పీసీసీ పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే..

17 Mar, 2022 18:39 IST|Sakshi

ఛండీగఢ్: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. 117 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం 18 స్థానాల్లో విజయం సాధించింది. అటు బీజేపీ పార్టీ సైతం ఆప్‌ ఎదుట నిలువలేకపోయింది. 

ఇదిలా ఉండగా.. పంజాబ్‌లో భారీ మెజార్టీతో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పంజాబ్‌ సీఎంగా భగవంత్‌ మాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం మాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సిద్ధూ చేసిన ట్వీట్ కాంగ్రెస్‌ అధిష్టానికి బిగ్‌ షాకిచ్చింది. సిద్ధూ తన ట్విట్‌లో ఆప్‌ను ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది. పంజాబ్​లో సరికొత్త మాఫియా వ్యతిరేక శకాన్ని భగవంత్​ మాన్​ ప్రారంభించారు. ఎవరూ ఊహించని వ్యక్తి సంతోషకరమైన వ్యక్తి  భగవంత్ మాన్. అంచనాలు అందుకుంటూ, ప్రజా అనుకూల విధానాలతో పంజాబ్‌ను తిరిగి గాడిన పెడతారనే నమ్మకం ఉందని ఆశిస్తున్నట్టు ట‍్విట్టర్‌ వేదికగా కామెంట్స్‌ చేశారు. 

అయితే, పంజాబ్‌లో ఓటిమి కారణంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాలతో పంజాబ్‌ పీసీసీ పదవికి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇలా రాజీనామా చేసిన తర్వాతి రోజే సిద్ధూ పరోక్షంగా అంతకు ముందున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేసినట్టు.. ఆప్‌ను ప్రశంసించడం సంచలనంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్‌ జీ-23 అసమ్మతి నేతలు పార్టీలో ప్రక్షాళన అవసరం అంటూ విమర్శలకు దిగుతున్న తరుణంలో సిద్ధూ ఇలా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సతరించుకుంది. 

మరిన్ని వార్తలు