వారు ఢిల్లీ రిమోట్‌ కంట్రోల్‌కు కొత్త బ్యాటరీలు: సిద్ధూ

22 Mar, 2022 16:44 IST|Sakshi

చంఢీఘడ్‌: కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)పై మంగళవారం విమర్శలు గుప్పించారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘన విజయం సాధించిన విజయం తెలిసిందే. పంజాబ్‌లో పదవి కాలం ముగిసన రాజ్యసభ స్థానాలకు ఆప్‌ ఐదుగురు అభ్యుర్థులను నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆప్‌ నామినేట్‌ చేసిన ఐదుగురు అభ్యర్థుల్లో.. నలుగురు ఢిల్లీలో రిమోట్‌ కంట్రోల్‌కి కోత్త బ్యాటరీలని ఎద్దేవా చేశారు. పంజాబీయేతరులు, బయటి వ్యక్తులను.. రాజ్యసభకు నామినేట్ చేసి పంజాబ్‌ ప్రజలను మోసం చేశారని ఆప్‌పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో సిద్ధూ తాజా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆప్‌ అధినేత, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దేశ రాజధాని ఢిల్లీలో కూర్చుని పంజాబ్‌ ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్నారని ఆరోపించారు. రాజ్యసభకు నానిమినేట్‌ చేసిన ఐదుగురిలో హర్భజన్ సింగ్‌ తప్ప మిగతా నలుగురు.. ఢిల్లీ రిమోట్‌ కంట్రోల్‌కి కొత్త బ్యాటరీలని ఎద్దేవా చేశారు. వారిని ఎంపిక చేయడం పంజాబ్‌ ప్రజలకు ద్రోహం చేయడమేనని సిద్ధూ మండిపడ్డారు.

ఆప్‌ అభ్యర్థులుగా ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, క్రికెటర్ హర్భజన్ సింగ్, ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ సందీప్ పాఠక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్‌పీయూ) వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ అశోక్ మిట్టల్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాలను రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 31న రాజ్యసభ సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు