టీడీపీ దిగజారుడు రాజకీయాలు సరికాదు.. ఆనం అరుణమ్మ ఫైర్‌

2 May, 2022 15:30 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ

నెల్లూరు(పొగతోట): మహిళలపై జరిగిన ఘటనల విషయంలో ప్రతిపక్ష నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ మండిపడ్డారు. ఆదివారం స్థానిక వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చైర్‌పర్సన్‌ మాట్లాడారు. మహిళలపై జరిగే ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో జగనన్న ప్రభుత్వం తీసుకున్న చర్యలు గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేపట్ట లేదన్నారు. ప్రతిపక్ష నాయకులు ఇటువంటి ఘటనలపై శవ రాజకీయాలు చేయడం సరికాదన్నారు.
చదవండి👉🏼 టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం

దారుణం జరిగితే మహిళలకు అండగా నిలువాలే తప్ప ఆమెను మానసికంగా చంపే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటనలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రవర్తించిన తీరు గర్హనీయమన్నారు. గుంటూరు జిల్లా తుమ్మపాడులో మహిళపై జరిగిన దారుణంపై పోలీసులు 24 గంటల వ్యవధిలో నిందితులను అరెస్ట్‌ చేశారన్నారు. 9 నెలలోపు నిందితులకు శిక్ష పడేలా చేసిందన్నారు. పోలీసు శాఖను మహిళలుగా అభినందిస్తున్నామన్నారు. మహిళలకు రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహ¯రెడ్డి మహిళల సంరక్షణకు దిశ యాప్‌ను ప్రారంభించి ఆపదలో ఉన్న మహిళలు సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసు శాక వారిని కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు. 100, 112 ద్వారా మహిళలకు రక్షణ కల్పించడం జగనన్నకు మహిళలపై ఉన్న బాధ్యతకు నిదర్శనమన్నారు. పెళ్లకూరు ఆత్మకూరు జెడ్పీటీసీలు ప్రిస్కిల్లా ప్రసన్నలక్ష్మి పలువురు పాల్గొన్నారు.   
చదవండి👉🏾 పన్నెండేళ్ల ప్రేమ.. పోలీసుల సమక్షంలో పెళ్లి..

మరిన్ని వార్తలు