పార్లమెంట్‌ కొత్త భవనం.. మోదీ మల్టీప్లెక్స్‌

24 Sep, 2023 05:42 IST|Sakshi

కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ఎద్దేవా  

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ నూతన భవనం సౌకర్యవంతంగా లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. నూతన భవన నిర్మాణ శైలి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్లుగా ఉందని ఆరోపించారు. ఈ భవనాన్ని ‘మోదీ మలీ్టప్లెక్స్‌’ లేదా ‘మోదీ మారియెట్‌’ అని పిలిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

పార్లమెంట్‌ నూతన భవనం పట్ల జైరామ్‌ రమేశ్‌ అభ్యంతరాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను జైరామ్‌ రమేశ్‌ కించపర్చారని మండిపడ్డారు. పార్లమెంట్‌ను కాంగ్రెస్‌ వ్యతిరేకించడం ఇదే మొదటిసారి కాదని అన్నారు.
అవయవదాతలకు

మరిన్ని వార్తలు