ఎన్నికల వేళ: మాయావతికి ఎదురుదెబ్బ

15 Jun, 2021 13:46 IST|Sakshi

సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అపుడు ఎన్నికల వేడి రాజుకుంటోంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీఎన్నికలకుముందు బీఎస్‌పీ అధినేత మాయావతికి భారీ ఎదురు దెబ్బ తగల నుందా? పార్టీకి చెందిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు పార్టీనుంచి జంప్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెబల్‌ ఎమ్మెల్యేలంతా ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్ వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో లక్నోలో భేటీ  పలు ఊహాగానాలకు  తెర తీసింది. 

ఎమ్మెల్యేలు హకీమ్ లాల్ బింద్ (హండియా), వందన సింగ్ (సాగ్రి), రామ్‌వీర్ ఉపాధ్యాయ (సదాబాద్), అనిల్ కుమార్ సింగ్ (పూర్వా), అస్లాం రైనీ (భింగా), అస్లాం అలీ (ధోలానా), ముజ్తాబా సిద్దిఖీ (ప్రతాపూర్), హర్గోవింద్ భార్గవ సిధౌలి) సుష్మా పటేల్ (ముంగ్రా బాద్షాపూర్) అఖిలేష్‌లను కలిశారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం  ఈ  భేటీ జరిగింది. త్వరలోనే వీరంతా సమాజ్ వాదీ పార్టీకి మారవచ్చనే వాదనలు ఊపందుకున్నాయి.

కాగా  2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ19 సీట్లు గెలుచుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు  సిద్దమవుతోంది.  గత ఏడాది రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఏడుగురు, లాల్జీ వర్మ, రామ్‌ అచల్‌ సహా మొత్తం 11మంది ఎమ్మెల్యేలను మాయావతి బహిష్కరించిన సంగతి తెలిసిందే. 2019లో ఒక ఎమ్మెల్యే  రాజీనామా చేశారు.  దీంతో ఇపుడు 7 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.

చదవండిట్విటర్‌కు మరోసారి నోటీసులు

మరిన్ని వార్తలు