బీజేపీ, అన్నాడీఎంకే మాటల యుద్ధం.. వచ్చే ఎన్నికల్లో పొత్తుపై క్లారిటీ

18 Sep, 2023 21:04 IST|Sakshi

చెన్నై: తమిళనాట బీజేపీ, అన్నాడీఎంకే మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని అన్నాడీఎంకే స్పష్టం చేసింది.  ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. ఎన్నికల సమయంలోనే చూసుకుంటామని పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు డీ జయకుమార్‌ సోమవారం చెప్పారు. 

దివంగత మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురైపై ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై ఏఐడీఎంకే తీవ్రంగా స్పందించింది. దివంగత నేత జయలలితతో సహా అన్నాడీఎంకే నేతలపై అన్నామలై ఇటీవల విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని అన్నారు. అన్నామలైపై విమర్శలు గుప్పిస్తూ.. అ‍న్నాదురైని అవమానిస్తే పార్టీ కార్యకర్తలు సహించరని అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు డి జయకుమార్ అన్నారు.

బీజేపీ కార్యకర్తలు కోరుకుంటున్నప్పటికీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి అన్నామలైకి ఇష్టం లేనట్లుంది. మా నేతలపై చేస్తున్న ఈ విమర్శలన్నీ మేం సహించాలా? బీజేపీ ఇక్కడ ఖాతా ఓపెన్ చేయలేదు. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు మాకు తెలుసు.” అని అన్నాడీఎంకే నేత జయకుమార్ మండిపడ్డారు. ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా అని జయకుమార్‌ను ప్రశ్నించగా.. వ్యక్తిగతంగా తాను మీడియాతో ఇలా మాట్లాడనని, పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో మాత్రమే మాట్లాడతానన్నారు.

ఇదీ చదవండి: తల్లిగా లాలిస్తూ.. మేయర్‌గా పాలన చేస్తూ..

మరిన్ని వార్తలు