నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు: కోమటిరెడ్డి

29 Jun, 2021 03:48 IST|Sakshi

ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటా

సాక్షి, హైదరాబాద్‌: తనను రాజకీయాల్లోకి లాగవద్దని, రాజకీయపరమైన విషయాలపై ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రజాసమస్యలు తీర్చేందుకు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని సోమవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తాను ఎంపీగా ఎన్నికైన తర్వాత తన నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించలేకపోయానని, ఇక నుంచి భువనగిరి, నల్లగొండ పార్లమెంటు స్థానాల పరిధిలోని గ్రామాల్లో పర్యటించి అక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు.

గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తానని, సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టి ప్రతీక్‌ ఫౌండేషన్‌ ద్వారా వీలైనన్ని ఎక్కువ కార్యక్రమాలు చేపడతానని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టులు, గంధమళ్ల, బస్వాపురం రిజర్వాయర్లను ప్రజలకు అందుబాటులో తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడతానన్నారు.   

మరిన్ని వార్తలు