‘సీఎం జగన్ కాపులకు పెద్ద పీట వేశారు’

17 Jul, 2021 17:04 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేత అడపా శేషుకు రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం నామినేటెడ్‌ పోస్టులను ప్రకటించారు. దీనిలో భాగంగా అడపా శేషుకు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కింది. తనకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అడపా శేషు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ‘‘సీఎం జగన్‌.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఎప్పుడూ మరువలేదు. రాష్ట్రంలో సీఎం జగన్ కాపులకు పెద్ద పీట వేశారు. పార్టీకి మంచి పేరు తీసుకుని వచ్చే విధానంగా పని చేస్తాను’’ అని అడపా శేషు తెలిపారు.

‘‘రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ కాపు కార్పొరేషన్. నిబద్ధతతో పని చేస్తాను. కాపు కులానికి అండగా ఉంటాను. ముఖ్యమంత్రి జగనన్నను నమ్ముకుంటే కచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. రాష్ట్రంలో సీఎం జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం జగన్ కాపు కార్పొరేషన్‌కే ఎక్కువగా నిధులు ఇచ్చారు’’ అని అడపా శేషు తెలిపారు. 

మరిన్ని వార్తలు