టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి నామినేషన్లు

17 Oct, 2021 15:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) తరఫున 5 సెట్ల నామినేషన్లు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దాఖలు చేశారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఈ నెల 25న టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నిక నిర్వహించనున్నారు. మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, అజయ కుమార్ నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

మరిన్ని వార్తలు