చీఫ్ సెక్రటరీని రిలీవ్ చేయలేను: మమతా బెనర్జీ

31 May, 2021 13:36 IST|Sakshi

కోల్‌కతా:  కేంద్రం, బెంగాల్‌ ప్రభుత్వం మధ్య కోల్డ్‌ వార్‌ ముదురుతోంది. బెంగాల్‌ ముఖ్యకార్యదర్శి అలపన్​ బందోపాధ్యాయను రిలీవ్‌ చేయలేమని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తేల్చిచెప్పారు. సీఎస్‌ను కేంద్రానికి రిపోర్ట్‌ చేయాలని వెలువడిన ఏకపక్ష ఉత్తర్వు త‌న‌ను షాక్‌కు గురిచేసింద‌ని మమత పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సోమవారం లేఖ రాశారు. కోవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో సీఎస్‌ను రిలీవ్‌ చేయలేమని.. కేంద్రం ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో చీఫ్ సెక్రటరీగా బందోపాధ్యాయను కొనసాగించాలని మమతాబెనర్జీ పీఎం మోదీకి రాసిన లేఖలో కోరారు. 

కాగా ఇటీవల యాస్‌ తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి మమతా ఆలస్యంగా రాగా . సీఎస్​తో సహా ఉన్నతాధికారులు ఎవరూ హాజరుకాలేదు. దీంతో సీఎస్‌ను అలపన్​ బందోపాధ్యాయను వెనక్కి పంపించాల్సిందిగా బెంగాల్​ ప్రభుత్వానికి కేంద్ర ఆదేశాలు జారీ చేసింది. 

చదవండి: మోదీ వర్సెస్​ దీదీ: భారీ హైడ్రామా.. ట్విస్టులు

మరిన్ని వార్తలు