జగ్గారెడ్డి మంత్రి కేటీఆర్‌ కోవర్టు.. గాంధీ భవన్‌లో అంతా ఇదే చర్చ

27 Sep, 2022 07:53 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి కేటీఆర్‌ కోవర్టు అని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. గాంధీ భవన్‌లో అంతా ఇదే విషయాన్ని చెప్పుకుంటున్నారన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం సంగారెడ్డి నియోజకవర్గంలో కొనసాగింది. కంది మండలం ఆరుట్లలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు.

అనంతరం మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కూడా పార్టీ మారారంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను షర్మిల తీవ్రంగా ఖండించారు. జగ్గారెడ్డి మాదిరిగా వైఎస్‌ఆర్‌ ఎప్పుడూ రాజకీయ వ్యభిచారం చేయలేదన్నారు. వైఎస్‌ఆర్‌ గెలిచిన పార్టీ కాంగ్రెస్‌లో కలిసిపోయిందనే విషయాన్ని గుర్తుచేశారు. సంతల్లో పశువులను కొనుగోలు చేసినట్టు జగ్గారెడ్డిని టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పారీ్టలు కొనుగోలు చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న జగ్గారెడ్డి రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదన్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి ఒక్క ఎకరానికైనా సాగు నీరందించని టీఆర్‌ఎస్‌ను జగ్గారెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
చదవండి: ప్రాజెక్టులకు సహకరించని రాష్ట్ర సర్కారు..కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శ

మరిన్ని వార్తలు