సెట్టింగ్‌ ‘బంగార్రాజు’.. ఇదేందయ్యా ఇది..

30 Jun, 2022 16:26 IST|Sakshi
ఎన్‌టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న చంద్రబాబు (ఫైల్‌)-బంగార్రాజు కారు షెడ్డులోనున్న విగ్రహం     

నెల్లిమర్ల(విజయనగరం జిల్లా): బంగార్రాజా మజాకా.. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయడానికి, రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు దక్కించుకోవడానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భోగాపురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజు పడరాని పాట్లు పడుతున్నారు. ఈనెల 17న భోగాపురం విచ్చేసిన చంద్రబాబుతో పోలిపల్లిలో ఎన్‌టీఆర్‌ విగ్రహం ఆవిష్కరణకు అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. టూర్‌ షెడ్యూల్‌లో లేనప్పటికీ బాబు కాన్వాయ్‌ను వెనక్కి మళ్లించి మరీ ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
చదవండి: రచ్చ రచ్చ.. మైదుకూరు టీడీపీలో డీఎల్‌ ‘చిచ్చు’

అయితే ఆవిష్కరణ అనంతరం బాబు వెళ్లిన వెంటనే ఎన్‌టీఆర్‌ విగ్రహం అక్కడినుంచి మాయమైంది. సదరు విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి, బంగార్రాజు తన కారు షెడ్డులో పెట్టేశారు. ఇదే విషయమై ఆ పార్టీ నియోజకవర్గ నేతలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. కేవలం చంద్రబాబును ఆకర్షించడానికే ఆవిష్కరణ చేపట్టి, అనంతరం తొలగించారని గుసగుసలాడుకుంటున్నారు. బాబు కళ్లకే గంతలు కట్టిన ఘనుడు బంగార్రాజు అని ముక్కును వేలేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు