Presidential Election 2022: పార్టీలు చీల్చారు.. డబ్బులు పంచారు: యశ్వంత్‌ సిన్హా

18 Jul, 2022 11:02 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో తన పోటీని.. ఒక పోరాటంగా అభివర్ణించుకున్నారు విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా. సోమవారం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న వేళ.. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను కేవలం రాజకీయ పోరాటం మాత్రమే చేయడం లేదు.. ప్రభుత్వ సంస్థలపై కూడా చేస్తున్నాను. వాళ్లు(అవతలి పక్షాలను ఉద్దేశించి..) చాలా శక్తివంతంగా మారారు. తమకే ఓట్లు వేయాలని ఒత్తిడి తెస్తూ పార్టీలను చీల్చారు. ఒకానొక దశలో డబ్బుతో ప్రలోభ పెట్టారు కూడా.

ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. దేశ ప్రజాస్వామ్యానికి మార్గాన్ని నిర్దేశిస్తాయి, అది నిలుస్తుందా లేదంటే ముగుస్తుందా అనేది చూడాలి. ఓటర్లందరూ తమ ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రహస్య బ్యాలెట్ ఓటింగ్‌. వారు తమ విచక్షణను ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నన్ను ఎన్నుకుంటారని ఆశిస్తున్నా అని రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు