బీజేపీతో అంటకాగిన వాళ్లనూ పిలిచారు.. మమ్మల్ని పిలవలేదు.. విపక్ష భేటీపై ఎంఐఎం అసంతృప్తి

19 Jul, 2023 13:13 IST|Sakshi

ఢిల్లీ: బీజేపీని ఓడించే ఏకైక లక్ష్యంతో ఏకమైన 26 పార్టీల విపక్ష కూటమి.. ఇండియా(I.N.D.I.A) పేరుతో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంఘటితంగా వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే రెండు రోజల బెంగళూరు విపక్ష భేటీకి తమను ఆహ్వానించకపోవడాన్ని  ఎంఐఎం తీవ్రంగా పరిగణించింది. 

రాజకీయంగా మేం అంటరానివాళ్లమని భావించారు గనుకే మమ్మల్ని విపక్ష భేటీకి పిలవలేదేమో అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మజ్లిస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వారిస్‌ పథాన్‌. ‘‘లౌకిక పార్టీలని చెప్పుకునే వాళ్లు.. ఎందుకనో మమ్మల్ని ఆహ్వానించలేదు. బహుశా రాజకీయ అంటరానితనమే అందుకు కారణం కాబోలు. ఒకప్పుడు బీజేపీతో ఉన్న నితీశ్‌ కుమార్‌, ఉద్దవ్‌ థాక్రే, మెహబూబా ముఫ్తీలను సైతం వాళ్లు పిలిచారు. అంతెందుకు.. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ తిట్టిపోసిన అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం వాళ్లతో బెంగళూరులో కూర్చున్నారు.

2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా మేం కృష్టి చేస్తున్నాం. కానీ, మా పార్టీని, పార్టీ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీని వాళ్లు పట్టించుకోలేదు అని వారిస్‌ వ్యాఖ్యానించారు. 

ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇంక్లూసివ్‌ అలయన్స్‌ పేరుతో విపక్ష కూటమి.. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టేందుకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నాయి. 

ఇదీ చదవండి: ఇండియాపై యుద్ధానికి దిగితే గెలుపెవరిదంటే..

మరిన్ని వార్తలు