కేసీఆర్‌ను బ్రోకర్లు, జోకర్లు, లోఫర్లే విమర్శిస్తారు 

18 Aug, 2021 08:24 IST|Sakshi

పీఏసీ చైర్మన్‌ ఎ.జీవన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును బ్రోకర్లు, జోకర్లు, లోఫర్లు అనే మూడు కేటగిరీలవారే విమర్శిస్తారంటూ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌ ఎ.జీవన్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బ్రోకర్, టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ జోకర్, నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ లోఫర్‌ అంటూ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో జీవన్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. సీఎం కౌటిల్యుడి లాంటివారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే సంక్షేమ పథకాలకు రూపకల్పన చేస్తారని అన్నారు.

దళితబంధు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల కుటుంబాలకు లక్షా 70 వేల కోట్ల రూపాయలు ఇస్తామని కేసీఆర్‌ చెప్పినా విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం సతీమణి శోభమ్మను కూడా రాజకీయాల్లోకి లాగడం శోచనీయమన్నారు. ‘రేవంతరెడ్డి ఓ అజ్ఞాని, దళితబంధుతో ఆయన లాంటి నేతల చిన్న మెదడు చిప్‌ పాడైంది. ఈ పథకం ద్వారా కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాలకు టు లెట్‌ బోర్డు పెట్టుకోవడం ఖాయం’అని వ్యాఖ్యానించారు. బండి సంజయ్‌ చేపట్టిన దరఖాస్తుల ఉద్యమాన్ని జోక్‌గా అభివర్ణిస్తూ, ప్రధాని మోదీ ఇచి్చన హామీలపై దరఖాస్తులు తీసుకోవాలని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు