టీఆర్‌ఎస్‌ విజయానికి కృషి చేస్తా: పనస రవికుమార్

23 Oct, 2022 18:51 IST|Sakshi

మునుగోడులో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయానికి కృషి చేస్తాం అని పారిశ్రామిక వేత్త పనస రవికుమార్ అన్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో రవి కుమార్ పనస, శ్రవణ్ దాసోజు తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రవి పనస సంతోషం వ్యక్తం చేశారు. 

ఇంకా రవి పనస, డాక్టర్‌ శ్రవణ్‌ దాసోజు మాట్లాడుతూ... తెలంగాణ, భారతదేశానికి గుండెలాంటిది. అలాంటి తెలంగాణని తెచ్చిన టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ... ‘శ్రవణ్, రవి పనస పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. వారిని హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నా’  అన్నారు.

మరిన్ని వార్తలు