‘రాజమండ్రిలో పవన్ కల్యాణ్‌ ప్రవర్తన చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది’

3 Oct, 2021 13:23 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: రాజమండ్రిలో పవన్ కల్యాణ్‌ ప్రవర్తన చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుందని వైఎస్సార్‌సీపీ నేత పండుల రవీంద్రబాబు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కులాల పై మాట్లాడే వారిని సభ్య సమాజంలో తిరగనీయకూడదన్నారు. దళితులపై ఆశలు మానుకోండని, కులాలపై రాజకీయాలు చేయడం ఆపండంటూ ఫైర్‌ అయ్యారు.

ముఖ్యమంత్రి జగన్మమోహన్‌రెడ్డిని దళితులు నమ్మారు. అందుకే ఆయన వారికి పెద్ద పీఠ వేశారని తెలిపారు. రాష్ట్రంలో రోడ్డు సమస్యే మీకు కనిపించిందా? అంతకు ముందు రెండు సార్లు వచ్చిన కోవిడ్ సమస్య కనిపించలేదా? రోడ్ల గురించి ఇంతగా తపించిపోతున్న నువ్వు కోవిడ్‌తో చనిపోయినా ఏ ఒక్క కుటుంబాన్నైనా కనీసం పరామర్శించావా? అంటూ ప్రశ్నించారు. తల.. గెడ్డం పెంచుకోవడం వల్ల కార్ల్ మార్క్ అవ్వరని పవన్‌పై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

చదవండి: పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఒంటరిగా పోటీ చేయాలి: బాలినేని

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు