మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బ

8 Mar, 2021 16:38 IST|Sakshi

సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీతకు తన జిల్లాలోనే ఎదురుదెబ్బ తగిలింది. కనగానపల్లి టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రామలింగయ్య టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన ఎమ్మెల్యేతో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సమక్షంలో సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మున్సిపల్‌ ఎన్నికల వేళ టీడీపీ నుంచి పలువురు నాయాకులు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. టీడీపీ ఆవిర్భవం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ సర్పంచ్‌గా ఎంపీపీగా, పదవులు అలంకరించిన కేఎస్‌ ఫైరోజ్‌ బేగం, ఆమె భర్త జిల్లా టీడీపీ సీనియర్‌ నాయకులు కేఎస్‌ ఉమర్‌తో పాటు మరో 50 కుటుంబాలకు చెందిన 200 మంది ఆదివారం వైఎస్సార్‌సీపీలో చెరిన విషయం తెలిసిందే.

చదవండి: ఉత్తరాంధ్ర అంటే జగదాంబ సెంటర్ కాదు

మరిన్ని వార్తలు