బీజేపీతో సమన్వయ లోపం: పవన్

23 Jan, 2021 04:49 IST|Sakshi

తిరుపతి (అన్నమయ్య సర్కిల్‌): బీజేపీ జాతీయ నాయకత్వం జనసేనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నా.. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు అంటీముట్టనట్టు వ్యవహరించడం వాస్తవమేనని.. ఇందుకు సమన్వయ లోపమే కారణమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.

శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ నాయకులు సరిగా లేరని, వారికి జనసేన బలం తెలియడం లేదన్నారు. అనంతరం అయోధ్యలో రామాలయ నిర్మాణానికి పార్టీ తరఫున రూ.30 లక్షల చెక్కును ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత్‌ ప్రచారక్‌ భరత్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు పవన్‌ అందజేశారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు