ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రద్దు హర్షణీయం

22 May, 2021 05:36 IST|Sakshi

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌

సాక్షి, అమరావతి: ఏప్రిల్‌లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏడాది క్రితం నోటిఫికేషన్‌ జారీ చేసి కోవిడ్‌ పరిస్థితుల కారణంగా ఎన్నికలు రద్దు చేశారని.. తిరిగి అదే నోటిఫికేషన్‌పై ఏడాది తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించడం అంటే ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కినట్లేనని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు