పవన్‌ కల్యాణ్‌ యాత్ర ఫ్లాప్‌ 

21 Aug, 2022 12:04 IST|Sakshi
జనసేన సభకు పలుచగా హాజరైన జనం...అభివాదం చేస్తున్న పవన్‌

జనాల రాకపై అంచనాలు తారుమారు

జనసేన సభకు టీడీపీ క్యాడర్‌

కేవలం ప్రభుత్వంపై బురదచల్లేందుకుజనసేనయత్నం

పవన్‌ ప్రసంగానికి జనం నుంచి పెద్దగా కనిపించని స్పందన

రాజంపేట(వైఎస్సార్‌ జిల్లా): జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ రాజంపేట నియోజకవర్గంలోని సిద్ధవటంలో శనివారం చేపట్టిన కౌలురైతు భరోసా యాత్ర బొమ్మ ప్లాప్‌ అయింది. షెడ్యూల్‌ ప్రకారం 1గంటకు చేరుకోవాల్సిన పవన్‌ కళ్యాణ్‌ 4 గంటలకు చేరుకున్నారు. ఆలస్యంగా ఆయన వచ్చినా ఓపెన్‌ గ్యాలరీలో జనం లేకపోవడం కనిపించింది. కేవలం మీడియా, మహిళల గ్యాలరీకే జనం పరిమితమయ్యారు. పాసులు ఇచ్చిన వారు మాత్రమే సభ ప్రాంగణం ముందున్న గ్యాలరీలో చేరుకున్నారు. సాధారణ జనం కోసం ఏర్పాటుచేసిన మైదానం  జనం లేక బోసిపోయింది. 

గందరగోళంగా సభ.. 
పవన్‌  సభ గందరగోళంగా మారింది. 150పైగా కౌలురైతులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పదేపదే చెప్పారు.  ఏ సంవత్సరం నుంచి అనేది లేకుండా కేవలం రాజకీయ ఉద్దేశ్యంతో ప్రభుత్వంపై బురదచల్లేందుకే అన్నట్లుగా సభ నిర్వహించారని  విమర్శలు వెలువడ్డాయి. పవన్‌ ప్రసంగానికి  స్పందన కనిపించలేదు. స్థానికేతరులు అధికంగా వచ్చారు.  

జనసేన సభకు టీడీపీ క్యాడర్‌ హాజరైంది.   సిద్ధవటంలో టీడీపీ నేత అతికారి వెంకటయ్య, ఆయన తనయుడు దినేష్, తమ్ముడు అతికారి కృష్ణ తోపాటు సంబంధీకులు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

మరిన్ని వార్తలు