2019లోనే చంద్రబాబును ప్రజలు క్విట్‌ చేశారు

29 May, 2022 04:56 IST|Sakshi

మంత్రి పెద్దిరెడ్డి  అనంతపురం సప్తగిరి 

సర్కిల్‌: చంద్రబాబును ప్రజలు 2019 ఎన్నికల్లోనే క్విట్‌ చేశారని.. 2024 ఎన్నికలే ఆయనకు, టీడీపీకి ఆఖరివని విద్యుత్, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురంలో నిర్వహించనున్న సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర ముగింపు సభ ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు. మీడియాతో మాట్లాడుతూ.. అసలైన టీడీపీ ఎన్టీఆర్‌తోనే ముగిసిపోయిందన్నారు.

ఇప్పుడు ఉన్నవారంతా కుట్రదారులు, వెన్నుపోటుదారులేనని దుయ్యబట్టారు. 2019 ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఓడించారనే వాస్తవాన్ని ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకోవాలని హితవు పలికారు.  ఎన్టీఆర్‌ మరణానికి కారణమైన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలను నిర్వహించడం హాస్యాస్పదమని పెద్దిరెడ్డి చెప్పారు. 

మరిన్ని వార్తలు