బాబుకు చిత్తూరు జిల్లాలో మనుగడ లేదు: పెద్దిరెడ్డి

1 Mar, 2021 04:57 IST|Sakshi

పుంగనూరు: చిత్తూరు జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బోణీ కాదని, ఆయన విజయవాడ పరిసర ప్రాంతాలకు వెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం పుంగనూరు మండలం కురప్పల్లెలో జరిగిన మసెమ్మ జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడతో కలసి విలేకరులతో మాట్లాడారు.

చంద్రబాబు కరోనాకు భయపడి ఎక్కడా పర్యటించకుండా ఇంటికే పరిమితమయ్యారని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారని గుర్తు చేశారు. పర్యటనలో ఆయన మాట్లాడిన పదజాలం వింటే హాస్యాస్పదంగా ఉందన్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు మనుగడ లేదని చెప్పారు. ఆయన కుప్పంలో కాదుకదా జిల్లాలో ఎక్కడా గెలవలేడని జోస్యం చెప్పారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు